దూకుడుగా ఆడిన పంజాబ్ కింగ్స్... సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్
- ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు
గెలిచినా, ఓడినా పోయేదేం లేదు అన్న స్థితిలో పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడారు. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్ విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది.
ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, అధర్వ తైదే తొలి వికెట్ కు 9.1 ఓవర్లలో 97 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభం అందించగా, వన్ డౌన్ లో రిలీ రూసో, కెప్టెన్ జితేశ్ శర్మ కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ స్కోరు 200 దాటింది.
పంజాబ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అధర్వ తైదే 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు సాధించాడు.
రిలీ రూసో కూడా వేగంగా ఆడడంతో పంజాబ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రూసో 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ (2), అశుతోశ్ శర్మ (2) విఫలమైనా, తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ బాగానే ఉన్నప్పటికీ, పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించలేదు. సన్ రైజర్స్ బౌలర్లలో టి.నటరాజన్ 2, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, విజయకాంత్ వియస్కాంత్ 1 వికెట్ తీశారు. ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో 1 ఫోర్, 2 వరుస సిక్సులు ఉన్నాయి.