నైరుతి రుతుపవనాల కదలికలపై అప్ డేట్ ఇచ్చిన ఐఎండీ

  • భారత్ లో నైరుతి రుతుపవనాలతో అత్యధిక వర్షపాతం 
  • ఈసారి సకాలంలోనే రుతుపవనాలు వస్తాయంటున్న ఐఎండీ
  • మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వెల్లడి
  • దక్షిణ బంగాళాఖాతంలోనూ ప్రవేశించాయని వివరణ
మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు భారత్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించనున్నాయి. దేశంలో అత్యధిక వర్షపాతం అందించే ఈ రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా సమాచారం వెలువరించింది. 

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాల్లో విస్తరించాయని, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోనూ ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడానికి అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయని వివరించింది. 

ఇక, మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయవ్య దిశగా పయనించి మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది.


More Telugu News