ఏపీలో టీడీపీ గెలుస్తోందంటూ ‘టైమ్స్ నౌ’ చెప్పడం నిజం కాదా?
- టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంటూ సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్ వైరల్
- అది ఫేక్ అని తేల్చేసిన ‘హిందూస్థాన్ టైమ్స్’
- వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ 2021 నాటి యూపీ ఎన్నికలకు సంబంధించినది
- దానినే మార్చి ఏపీ ఎగ్జిట్ పోల్ అంటూ ప్రచారం
- జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తామన్న ‘టైమ్స్ నౌ’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ‘టైమ్స్ నౌ’ ఎగ్జిట్ పోల్స్ చెప్పిందంటూ ఓ స్క్రీన్‌షాట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఈ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఓ యూజర్ ‘‘ఇది సాక్షి, టీవీ9 కాదు. టైమ్స్ నౌ. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్’ అని కామెంట్ పెట్టాడు. ఆ వెంటనే అది వైరల్ అయింది. ఆ స్క్రీన్ షాట్ ప్రకారం టీడీపీకి 95-100, జనసేనకు 16-18, బీజేపీకి 3-5, వైసీపీకి 55-60, ఇతరులకు 0-1 వస్తాయని అంచనా వేశారు.
వైరల్ అవుతున్న ఈ స్క్రీన్‌షాట్ నిజం కాదని ‘హిందూస్థాన్ టైమ్స్’ తేల్చింది. టైమ్స్ నౌ 16 నవంబర్ 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ను మార్చి ఇలా ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. వైరల్ అవుతున్న ఈ స్క్రీన్‌షాట్‌పై టైమ్స్ నౌతో కలిసి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే పోలింగ్ ఏజెన్సీ ‘ఈటీజీ’ స్పందించింది. తాము ఏప్రిల్ 4న సీట్ షేరింగ్ అంచనాలను మాత్రమే ప్రచురించామని, ఇది ప్రీ పోల్ సర్వే మాత్రమేనని వివరించింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ విడుదలచేయనున్నట్టు తెలిపింది.