అర్థం చేసుకునే వారికి చెప్పగలం... అలాంటి వాళ్లకు వివరణ ఇచ్చి ప్రయోజనం లేదు: విజయశాంతి
- బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను నిన్న తప్పుబట్టిన విజయశాంతి
- ఆమె పార్టీ మారుతున్నారంటూ ప్రచారం
- దక్షిణ ప్రాంతం రాజకీయాల గురించి చెప్పినందుకు కొందరు సొంత కథ అల్లుతున్నారని ఆగ్రహం
- అలాంటి వారికి సమాధానం చెప్పలేమన్న విజయశాంతి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తప్పుబట్టారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై ఆమె ఈరోజు స్పందించారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలా ఉంటాయో... గత, ఇప్పటి పరిస్థితులను ఉదహరించి తాను ట్వీట్ చేసినట్లు తెలిపారు.
దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను నిన్నటి పోస్టులో వ్యక్తపరిచానన్నారు. కానీ అవగాహన చేసుకునే తత్వంలేని కొందరు ఆ పోస్టుపై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు వారే రాసి వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత కల్పన అల్లారని విమర్శించారు.
అయినా, అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలమని... కాని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నారు.