అమృత్‌సర్‌లో ఎంపీ అభ్యర్థి ప్రచారంలో కాల్పుల కలకలం
- కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ప్రచారంలో ఘటన
- ఓ కార్యకర్తకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు
- అమృత్‌సర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన గుర్జీత్ సింగ్
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్జీత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో జరిగిన ఘటనలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అమృత్‌సర్ నుంచి గుర్జీత్ సింగ్ వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2017 ఉప ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అమృత్‌సర్ లోక్ సభ స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్ తరఫున గుర్జీత్ సింగ్, బీజేపీ తరఫున తరణ్‌జిత్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుల్దీప్ సింగ్ బరిలో నిలిచారు.