ఐపీఎల్ తాజా సీజన్ లోనే అత్యంత కీలక మ్యాచ్ ఇది... బెంగళూరుపై టాస్ నెగ్గిన సీఎస్కే
- ఇప్పటికే ఐపీఎల్ లో మూడు బెర్తులు ఖరారు
- నాలుగో బెర్తు కోసం సీఎస్కే, ఆర్సీబీ మధ్య చావోరేవో మ్యాచ్
- బెంగళూరుకు లాభించనున్న సొంతగడ్డ అంశం
ఐపీఎల్ 17వ సీజన్ లోనే అత్యంత కీలక మ్యాచ్ నేడు జరుగుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించగా.... మిగిలి ఉన్న ఒకే ఒక బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయినా చెన్నైకే అనుకూలం.
అయితే ఆర్సీబీ ఈ మ్యాచ్ లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరాలంటే కొన్ని ప్రత్యేక సమీకరణాలు అనుకూలించాలి. అవి ఏమిటంటే... ఒకవేళ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే 200కి పైగా పరుగులు చేయాలి. ఆ తర్వాత 18 పరుగుల తేడాతో చెన్నైపై గెలవాలి. ఒక వేళ ఆర్సీబీ లక్ష్యఛేదనకు దిగితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించాల్సి ఉంటుంది. అప్పుడే చెన్నై రన్ రేట్ ను బెంగళూరు జట్టు అధిగమించగలుగుతుంది.