హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం!
- హైదరాబాద్‌లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
- నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం
- వర్షం కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్
- అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం ఆ తర్వాత పెరిగింది. రెండు రోజుల క్రితం కూడా భాగ్యనగరంలో కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కూకట్‌పల్లి, బషీర్ బాగ్, పటాన్ చెరు, మియాపూర్, చందానగర్, అబిడ్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, అల్వాల్, ఉప్పల్, రాంనగర్, మెహిదీపట్నం, రామంతాపూర్, అంబర్‌పేట్, శేరిలింగంపల్లి, మాసబ్‌ట్యాంక్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఇతర సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.