ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసు... కేజ్రీవాల్ పీఏ అరెస్ట్
- కేజ్రీవాల్ నివాసంలో పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారన్న స్వాతి మలివాల్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆప్ రాజ్యసభ సభ్యురాలు
- బిభవ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- స్వాతి మలివాల్ పై కౌంటర్ ఫిర్యాదు చేసిన బిభవ్ కుమార్
సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్ర స్థాయిలో దాడి చేశాడంటూ ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
స్వాతి మలివాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. బిభవ్ కుమార్ నివాసానికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. ఈ సాయంత్రం లోపు బిభవ్ కుమార్ ను పోలీసులు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
కాగా, సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి స్వాతి మలివాల్ అపాయింట్ మెంట్ లేకుండానే ప్రవేశించి తనను దూషించారని బిభవ్ కుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అటు, బిభవ్ కుమార్ అరెస్ట్ పై ఆప్ న్యాయ విభాగం అధ్యక్షుడు సంజీవ్ నాసియార్ స్పందించారు. బిభవ్ కుమార్ ను నోటీసులు లేకుండానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఆయన అరెస్ట్ కు సంబంధించి తమకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని వెల్లడించారు.