ఏపీలో మూడు జిల్లాల ఎస్పీ పోస్టులు ఖాళీ... ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు పంపాల్సిందేనంటూ సీఎస్ కు ఈసీ లేఖ

  • ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం హింసాత్మక ఘటనలు
  • పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలపై వేటు
  • ఒక్కో పోస్టుకు ముగ్గురు పేర్లు పంపాలన్న ఈసీ
  • ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరంటూ ఐదుగురి పేర్లే పంపిన సీఎస్
  • మొత్తం 9 మంది పేర్లు పంపాల్సిందేనంటూ మరోసారి లేఖ రాసిన ఈసీ
ఏపీలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై వేటు  పడిన సంగతి తెలిసిందే. ఈ మూడు జిల్లాల ఎస్పీ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీనిపై అర్హుల జాబితా పంపాలని ఈసీ... ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసింది. 

అయితే, ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరంటూ సీఎస్ జవహర్ రెడ్డి మూడు పోస్టులకు కేవలం ఐదుగురి పేర్లు పంపారు. దీనిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి సీఎస్ కు లేఖ రాసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు చొప్పున తొమ్మిది మంది పేర్లు పంపాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

ఈసీ తాజా ఆదేశాల నేపథ్యంలో, సీఎస్ జవహర్ రెడ్డి ఒక్కో ఎస్పీ పోస్టుకు ముగ్గురేసి అధికారుల పేర్లను పంపించారు. ఈ సాయంత్రంలోగా మూడు జిల్లాలకు ఎస్పీల నియామకాన్ని ఈసీ పూర్తి చేయనుంది.


More Telugu News