తెలంగాణ కేబినెట్ భేటీపై సస్పెన్స్... ఈసీ అనుమతి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదురుచూపు

  • ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం
  • ఈసీ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్న ప్రభుత్వం 
  • కేబినెట్ భేటీకి ఈసీ అనుమతివ్వకుంటే మంత్రులతో రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ భేటీకి ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. ఈసీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఎన్నికల కమిష్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతించకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్‌‌లో ఉన్న అంశాలు, రాష్ట్రానికి ఆదాయ వనరులు, ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో చర్చించాలని భావించారు.


More Telugu News