ఆ హామీలు అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు: కిషన్ రెడ్డి

  • తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్న కిషన్ రెడ్డి
  • తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయని జోస్యం
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్న కిషన్ రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారన్నారు. తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయని జోస్యం చెప్పారు.

ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుతామని వెల్లడించారు. బీఆర్ఎస్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.


More Telugu News