ఉచిత బస్సు ప్రయాణం.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఫైర్!
- ఉచిత బస్సు సౌకర్యం వల్ల నష్టం జరుగుతున్నట్లు మోదీ మాట్లాడడం సరికాదన్న పొన్నం ప్రభాకర్
- మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్య
- ఆర్టీసీలో ప్రయాణానికి.. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్న కాంగ్రెస్ నేత
- ఇది కేవలం మోదీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచనగా పేర్కొన్న మంత్రి పొన్నం
ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు ప్రధాని మోదీ మాట్లాడడం సరికాదంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని తన స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని మోదీ జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి అన్నారు.
కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు. దీనివల్ల మెట్రోకు నష్టం జరుగుతుందనడం సబబు కాదన్నారు. అసలు ఆర్టీసీలో ప్రయాణానికి.. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని పొన్నం పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచనగా మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఇంకా కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.