ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్టు వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ టీమ్ స్పందన
- 2003లో జూబ్లీహిల్స్ లో మహిళ నుంచి స్థలం కొనుగోలు చేసిన ఎన్టీఆర్
- ఆ స్థలంపై అప్పటికే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న మహిళ
- లోన్లు తీసుకున్న విషయం దాచి ఎన్టీఆర్ కు భూమి విక్రయం
- స్థలం హక్కులు బ్యాంకులకే ఉంటాయన్న ట్రైబ్యునల్
- ట్రైబ్యునల్ తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారంటూ నేడు వార్తలు
- ఆ వార్తల్లో నిజం లేదన్న ఎన్టీఆర్ టీమ్
టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని ఓ స్థలానికి సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించినట్టు ఇవాళ కథనాలు వచ్చాయి. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది.
ప్రస్తుతం వార్తల్లో ప్రస్తావిస్తున్న ప్లాట్ ను ఎన్టీఆర్ 2013లోనే విక్రయించారని వెల్లడించింది. ఈ వివాదంలోకి ఎన్టీఆర్ పేరును తీసుకురావద్దని స్పష్టం చేసింది. ఆ స్థలంతో, ఆ వివాదంతో ఎన్టీఆర్ కు సంబంధం లేదని పేర్కొంది.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఎన్టీఆర్ 2003లో కొంత స్థలాన్ని ఓ మహిళ నుంచి కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలంపై అనేక లోన్లు తీసుకున్న మహిళ... ఆ విషయాన్ని దాచి ఎన్టీఆర్ కు స్థలాన్ని విక్రయించారు. తీసుకున్న లోన్లు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆ స్థలంపై డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా... ఆ స్థలంపై హక్కులు బ్యాంకులకే ఉంటాయని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. అయితే, ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారంటూ ఇవాళ వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే, ఎన్టీఆర్ టీమ్ ఓ ప్రెస్ నోట్ ద్వారా వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.