ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం

  • సుప్రీంకోర్టులో శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
  • జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పేరును పేర్కొన్న వైనం 
  • కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాటింగ్‌ను గుర్తించినట్లు పేర్కొన్న ఈడీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుల జాబితాలో తొలిసారి ఓ పార్టీ పేరును ఈడీ చేర్చింది. సుప్రీంకోర్టులో శుక్రవారం దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన పార్టీని కూడా నిందితుల జాబితాలో చేర్చింది. 

కేజ్రీవాల్ సెవెన్ స్టార్ హోటల్‌లో బస చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. ఈ కేసులో నిందితుడు బిల్లులు కొంతవరకు చెల్లించినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారన్నారు.

ఈ కేసులో నేరారోపణలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాటింగ్‌లను గుర్తించినట్లు సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ తన డివైజ్‌ల పాస్‌వర్డ్‌లను ఇచ్చేందుకు నిరాకరించారని తెలిపింది. అయితే హవాలా ఆపరేటర్ల డివైజ్‌ల ద్వారా ఆ చాటింగ్‌ల సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది.


More Telugu News