ఐపీఎల్: లక్నో సూపర్ జెయింట్స్ పై టాస్ గెలిచిన ముంబయి... పరువు కోసం పోరాటం

  • ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబయి
  • టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిన టీమ్
  • నేడు లక్నోతో పోరు... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఘనమైన రికార్డు ఉన్న జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. అంతటి గొప్ప జట్టు కూడా గత కొన్ని సీజన్లుగా చతికిలపడుతోంది. గత మూడు సీజన్లలో రెండు పర్యాయాలు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 

కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను తీసుకువచ్చినా, నానాటికీ తీసికట్టు అన్నట్టు ముంబయి పరిస్థితి తయారైంది. ఆ జట్టు ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో పరువు కోసం తలపడుతోంది. సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ముంబయి జట్టు టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ కాగా, లక్నో అవకాశాలు కూడా దాదాపు మూసుకుపోయాయి. దాంతో నేటి మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ లో ఇరు జట్లకు ఇదే చివరి లీగ్. 

ముంబయి ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి కేవలం 4 విజయాలు సాధించింది. 9 మ్యాచ్ లు ఓడిపోయింది. ఈ విషయంలో లక్నో జట్టు కొంత మేలు... ఆ జట్టు 13 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది.


More Telugu News