నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను: రాయ్‌బరేలీలో సోనియా గాంధీ
- నన్ను ఎలా ఆదరించారో నా కుమారుడు రాహుల్ గాంధీని అలాగే ఆదరించాలని విజ్ఞప్తి
- చాలా రోజుల తర్వాత మీ మధ్యకు వచ్చే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్న సోనియా గాంధీ
- రాయ్‌బరేలీ నా కుటుంబం... అమేథీ కూడా నా ఇల్లు అని సోనియాగాంధీ వ్యాఖ్య
'నన్ను మీరు ఎలా ఆదరించారో... నా కొడుకు రాహుల్ గాంధీని కూడా అలాగే ఆదరించండి. ఆయన మిమ్మల్ని నిరాశపరచడు. నా కుమారుడిని ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను' అని రాయ్‌బరేలీ ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె రాయ్‌బరేలిలో మాట్లాడుతూ... అందరినీ గౌరవించడం, బలహీనులను రక్షించడం, ప్రజల హక్కులు కాపాడటం, అన్యాయంపై పోరాడటం తనకు ఇందిరాగాంధీ, రాయ్‌బరేలీ ప్రజలు నేర్పించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలు కూడా వీటిని అలవరుచుకున్నారన్నారు.
2004 నుంచి తనను వరుసగా గెలిపిస్తూ వచ్చిన రాయ్‌బరేలీ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చాలారోజుల తర్వాత మీ మధ్యకు వచ్చే అవకాశం తనకు ఇప్పుడు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇరవై ఏళ్ల పాటు మీకు సేవ చేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
'రాయ్‌బరేలీ నా కుటుంబం. అదే విధంగా అమేథీ కూడా నా ఇల్లు. ఈ ప్రదేశంతో నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా కుటుంబం యొక్క మూలాలు కూడా గత 100 సంవత్సరాలుగా ఈ నేలతో ముడిపడి ఉన్నాయ'ని అన్నారు.