కేజ్రీవాల్ ఇంట్లో జరిగింది ఇదీ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్... కౌంటర్ ఇచ్చిన స్వాతి మాలివాల్
- కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని స్వాతి మాలివాల్ దూషించినట్లుగా ఉన్న వీడియో వైరల్
- గంజా సాలా అంటూ సిబ్బందిపై స్వాతి మాలివాల్ మండిపాటు
- తనను తాను రక్షించుకోవడానికి హిట్ మ్యాన్ ప్రయత్నిస్తున్నారని స్వాతి మాలివాల్ కౌంటర్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. తనపై దాడి జరిగిందంటూ స్వాతి మాలివాల్ ఆరోపణలు చేయడంతో, ఆ రోజు జరిగింది ఇదీ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓ వీడియోను ట్వీట్ చేసింది. తద్వారా సొంత పార్టీ ఎంపీపై ఢిల్లీ అధికార పార్టీ ఎక్స్ ద్వారా అటాక్ చేసింది. 'స్వాతి మాలివాల్ కా సచ్' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో స్వాతి మాలివాల్... కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని దూషించినట్లుగా ఉంది. 'గంజా సాలా' అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఉంది. భద్రతా సిబ్బందికి, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించి 52 సెకన్ల వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట్ చేసింది.
ఈ వీడియోపై స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా రాజకీయ హిట్ మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారని ఎక్స్ వేదికగా విమర్శించింది. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చునని భావిస్తున్నారని పేర్కొన్నారు.
ఒకరిని కొడుతున్న వీడియోను ఎవరు తీస్తారు? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే నిజం వెలుగు చూస్తుందన్నారు. ఎవరు ఎంతకు దిగజారినా... పై నుంచి దేవుడు చూస్తున్నాడన్నారు. ఏదో ఒకరోజు ప్రపంచం ముందుకు అన్ని విషయాలు వస్తాయని వ్యాఖ్యానించారు.