ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ సందడి.. ఇదిగో వీడియో!
- చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య కీలక పోరు
- ఇప్పటికే బెంగళూరు చేరుకున్న సీఎస్‌కే.. ప్రాక్టీస్‌తో ఫుల్ బిజీ
- ఈ క్రమంలో ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన సీఎస్‌కే మాజీ కెప్టెన్ ధోనీ
- ఆ సమయంలో తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఆర్‌సీబీ
చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్‌సీబీకి ఈ మ్యాచులో మంచి విజయం తప్పనిసరి. అదే సమయంలో సీఎస్‌కేకు కూడా బెంగళూరును ఓడించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ పోరులో చెన్నై భారీ మార్జిన్‌తో ఓడితే మొదటికే మోసం వస్తుంది. సో.. రెండు జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిందన్నమాట. ఈ కీలక మ్యాచుకు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఈ కీలక పోరు కోసం ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బెంగళూరుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది. ఈ క్రమంలో సీఎస్‌కే మాజీ కెప్టెన్ ధోనీ ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ ఎంఎస్‌డీ కాసేపు సరదాగా గడిపాడు. ఆర్‌సీబీ ప్లేయర్లతో కలిసి టీ తాగాడు. ఇలా తమ డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ సందడి చేసిన వీడియోను ఆర్‌సీబీ జట్టు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలాఉంటే.. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు మూడు జట్లు అర్హత సాధించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నాకౌట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఎస్ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్స్‌కు మార్గం సుగమమైంది. దీంతో నాలుగో బెర్త్ కోసం బెంగళూరు, చెన్నై మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రేపటి మ్యాచ్‌తో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.