కవితను మద్యం పాలసీ కేసులో అన్యాయంగా ఇరికించారు: బాల్క సుమన్
- బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా.. తలవంచకుండా పోరాటం చేస్తామన్న సుమన్
- కవిత మాసికంగా బలంగా ఉన్నారని వ్యాఖ్య
- ఢిల్లీ లిక్కర్ కేసు ఒక కేసే కాదు.. అదొక పాలసీ మాత్రమేనని వ్యాఖ్య
విపక్ష నాయకులను అణచివేయాలనే ఆలోచనలో భాగంగానే కవితని అన్యాయంగా మద్యం పాలసీ కేసులో ఇరికించారని బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం తీహార్ జైల్లో కవితతో ములాఖత్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా.. తలవంచకుండా పోరాటం చేస్తామన్నారు. కవిత మాసికంగా బలంగా ఉన్నారన్నారు.
న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నట్లు చెప్పారు. బీజేపీకి ఎవరూ ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు ఒక కేసే కాదు.. అదొక పాలసీ మాత్రమే అన్నారు.
మద్యం పాలసీ కేసును బూచిగా చూపించి తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయొచ్చనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారని... కానీ భయపడే ప్రసక్తే లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమన్నారు. బీజేపీ 220 సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పారు. ఢిల్లీలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు.