అజ్ఞాతంలోకి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి!

  • ఏపీలో పోలింగ్ అనంతరం పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
  • మాచర్లలో 144 సెక్షన్
  • గృహనిర్బంధంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • గన్ మన్లను కూడా వదిలేసి వెళ్లిపోయిన పిన్నెల్లి సోదరులు
  • విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారంటున్న వైసీపీ నేతలు
ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించి వివరణ తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసింది.

తాజాగా, అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్ మన్లను కూడా వదిలేసిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్ మన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 

కాగా, ఎమ్మెల్యే పిన్నెల్లి విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు.


More Telugu News