ఈ సాయంత్రం హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ భారీ వ‌ర్షం.. వాతావ‌ర‌ణ శాఖ‌ హెచ్చ‌రిక‌!

  • ఉత్త‌ర‌, ద‌క్షిణ ద్రోణి ప్ర‌భావంతో ఇవాళ సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు భారీ వ‌ర్షం 
  • హైద‌రాబాద్‌తో పాటు రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్, మెద‌క్‌, సంగారెడ్డి జిల్లాల్లో వాన‌లు ప‌డ‌తాయ‌న్న వాతావ‌ర‌ణ శాఖ‌
  • ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌కు హెచ్చ‌రిక‌ల జారీ
శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌తో పాటు రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్, మెద‌క్‌, రాజ‌న్న సిరిసిల్ల‌, సంగారెడ్డి జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఉత్త‌ర‌, ద‌క్షిణ ద్రోణి ప్ర‌భావంతో నేడు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 

ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌లు కురిసే స‌మ‌యంలో పిడుగులు ప‌డే అవకాశం ఉంటుంది క‌నుక ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. ఇక గురువారం సాయంత్రం కూడా భాగ్య‌న‌గ‌రంలో ప‌లు ప్రాంతాలలో భారీ వ‌ర్షం కురిసిన విష‌యం తెలిసిందే. దీంతో విధుల‌కు, ప‌నుల కోసం బ‌య‌ట‌కు వెళ్లిన జ‌నాలకు ఇక్క‌ట్లు త‌ప్ప‌లేదు.


More Telugu News