గుండెల నిండా ఆత్మవిశ్వాసం కావాలా? అయితే ఇలా చేయండి

  • అది మనవల్ల ఎక్కడవుతుందని అనుకుంటారు కొందరు
  • మధ్యలోనే కాడిపారేస్తారు మరికొందరు
  • కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకునే అవకాశం
మనం ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నా, మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవాలన్నా ఆత్మవిశ్వాసం తప్పనిసరి. కొందరు చిన్నచిన్న విషయాలకే బోల్డంత ఆత్మన్యూనతకు లోనై మధ్యలోనే కాడిపారేస్తుంటారు. ఇది మన వల్ల ఏమవుతుంది? అని నిరుత్సాహానికి గురవుతుంటారు. అయితే, ఇలాంటి వారు కూడా కొన్ని టిప్స్ పాటించడం ద్వారా బోల్డంత ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.

తొలుత మన శక్తిసామర్థ్యాలపై మనకు బలమైన నమ్మకం ఉండాలి. మనం ఎలాంటి పనులనైతే బాగా చేయగలమో గుర్తించాలి. అలాగే, మంచి స్నేహితులతో గడపాలి. అంటే మనల్ని గుర్తించి ప్రోత్సహించే మిత్రుల వెన్నంటి నడవాలి. అన్నిటి కంటే ముఖ్య విషయం పోల్చుకోవడం. ఎవరితోనూ ఎప్పుడూ మనల్ని మనం పోల్చుకోవద్దు.. ఇవే కాదు ఇంకెన్నింటినో పాటించడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. మరి అవేంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి.



More Telugu News