వారణాసిలో మోదీకి పోటీగా ఎవరూ ఉండకుండా కుట్రలు: జ్యోతిమఠ్ శంకరాచార్యులు
- వారణాసిలో భయానక పరిస్థితులున్నాయన్న స్వామి అవిముక్తేశ్వరానంద
- దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అన్న అనుమానం కలుగుతోందని ఆందోళన
- అర్ధరాత్రి వేళ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి తలుపుకొట్టి భయపెడుతున్నారని ఆరోపణ
జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్న వారిని వారణాసి మేయర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీకి పోటీగా ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
నామినేషన్ వేసిన వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి తలుపుకొట్టి భయపెడుతున్నారని, వారణాసిలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న అనుమానం కలుగుతోందని వాపోయారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బరిలో ఉన్న వారణాసి స్థానానికి మొత్తం 43 నామినేషన్లు దాఖలు కాగా, ఈసీ ఏకంగా 36 నామినేషన్లను తిరస్కరించింది. గురువారం నాటికి మొత్తంగా వారణాసి బరిలో నిలిచింది ఆరుగురు మాత్రమే.