ఏపీలో ఒకవైపు వర్షాలు... మరోవైపు వడగాడ్పులు
- ఏపీలో అకాల వర్షాలు
- కొన్ని ప్రాంతాల్లో మండుటెండలు, వడగాడ్పులు
- రేపు కూడా ద్రోణి ప్రభావంతో వర్షాలు
- కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు
ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, మరోవైపు పలు చోట్ల వడగాడ్పులు హడలెత్తిస్తున్నాయి. ఇవాళ ఒంగోలులో 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో 48.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కాగా, రేపు నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, కడప, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కృష్ణా, పార్వతీపురం మన్యం, బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
రేపు అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరాలు తెలిపారు.