కొందరి బలహీనత వల్ల పీవోకే చేజారింది... ఒక్కరు చేసిన పొరపాటు వల్ల నియంత్రణ కోల్పోయాం: కేంద్రమంత్రి జైశంకర్
- లక్ష్మణరేఖను దాటి పీవోకేను భారత్ విలీనం చేసుకుంటుందా? అని మీడియా ప్రశ్న
- కాంగ్రెస్ హయాంలో తప్పులు జరిగాయన్న జైశంకర్
- లక్ష్మణ రేఖ వంటివి ఉండవని... పీవోకేను భారత్‌లో భాగంగా భావిస్తున్నట్లు వెల్లడి
కొందరి బలహీనత వల్ల పీవోకే మన చేజారిందని... ఒక్కరు చేసిన పొరపాటు కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మనం తాత్కాలికంగా నియంత్రణ కోల్పోయామని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన 'విశ్వబంధు భారత్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు 'లక్ష్మణ రేఖను దాటి పీవోకేను భారత్ విలీనం చేసుకుంటుందా?' అని ప్రశ్నించారు.
దీంతో జైశంకర్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పులు జరిగాయన్నారు. లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయని తాను నమ్మనని తెలిపారు. పీవోకేను భారత్‌లో భాగంగానే భావిస్తున్నామన్నారు. కొందరి బలహీనత వల్ల అది చేజారిందని, పీవోకేపై మనం పట్టు కోల్పోవడానికి వారి బలహీనతే కారణమని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశించి అన్నారు. పీవోకే ఎప్పటికీ భారత్‌దే అన్నారు.
విశ్వవేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఎన్నడూ వీడకూడదన్నారు. పదేళ్ల క్రితం వరకు ఇలా ఎవరూ మాట్లాడి ఉండరని వ్యాఖ్యానించారు.
భారత్ విషయంలో చైనా చేపట్టిన చర్యలను ఆ దేశంలో తాను రాయబారిగా ఉన్నప్పుడు గమనించానని జైశంకర్ అన్నారు. చైనా తీరు అందరికీ తెలిసిందేనన్నారు. పాక్‌తో కలిసి పని చేస్తోందని సీపెక్‌ను ఉద్దేశించి అన్నారు. వారివి కాని భూభాగాలను ఆక్రమించుకోలేరని పాక్, చైనాలకు పలుమార్లు చెప్పామన్నారు.