పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికాయి: పల్నాడు ఎస్పీ బిందు మాధవ్

  • పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న హింస
  • ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం
  • పెట్రోలు బాంబుల ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశామని వెల్లడి
ఎన్నికల వేళ, అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబులు దొరికాయని వెల్లడించారు.

పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని తెలిపారు. కొందరి ఇళ్లలో పెట్రోలు బాంబులు గుర్తించామని చెప్పారు. పెట్రోలు బాంబుల ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. బాంబులు ఎవరు తయారుచేస్తున్నారో విచారణ జరుపుతున్నాం అని తెలిపారు. జిల్లాలో తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

కాగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబుల కలకలం రేగింది. ముప్పాళ్ల మండలం మాదలలో పోలీసులు వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు గుర్తించారు. 

అటు, కారంపూడి దాడుల ఘటనలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వైసీపీకి చెందిన 12 మందిని, టీడీపీకి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News