తెలంగాణ ప్రభుత్వం వద్ద ఖజానా లేదు.. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలేనని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపాటు
  • రైతుల రుణమాఫీకి రూ.32వేల కోట్లు అవసరమవుతాయని... అది సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్న
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఖజానా లేదని... ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ నేత, చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలే అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రైతుల రుణమాఫీకి రూ.32వేల కోట్లు అవసరమవుతాయని... అది సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ దుకాణాల్లో ఇప్పుడు ఇస్తున్న ఐదు కిలోల బియ్యానికి బదులు పది కేజీలు ఇస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెబుతున్నారని... ఆయన కనీసం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 2047 కల్లా  భారత్‌ను ప్రపంచపటంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారన్నారు.


More Telugu News