ప్రత్యేక కోర్టు కేసును విచారణకు స్వీకరిస్తే నిందితుడిని అరెస్ట్ చేయొద్దు: ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం
- కస్టడీలోకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు
- అనుమతి కోసం ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయాలని సూచన
- సెక్షన్ 19 కింద నిందితుడిని అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదని స్పష్టీకరణ
దేశంలో ఈడీ కేసులు పెరిగిపోతున్నాయి. మనీలాండరింగ్ కేసుల్లో ఉన్న నిందితులను ఈడీ అధికారులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఒకవేళ కస్టడీకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
పీఎంఎల్ ఏ చట్టం సెక్షన్ 44 కింద నమోదైన మనీలాండరింగ్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.... సెక్షన్ 19 కింద నిందితుడిని అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక కోర్టు సమన్ల మేరకు నిందితుడు న్యాయస్థానం ముందు హాజరైతే దాన్ని కస్టడీలో ఉన్నట్టుగా భావించకూడదని చెప్పింది. ఒకవేళ కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే ప్రత్యేక కోర్టులో అనుమతి కోసం పిటిషన్ వేయాలని తెలిపింది. ఈడీ తెలిపిన కారణాలతో ప్రత్యేక కోర్టు సంతృప్తి చెందితేనే కస్టోడియల్ విచారణకు అనుమతిస్తుందని చెప్పింది. ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని తెలిపింది.