గెలిస్తే జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు

  • తీర్పుపై విమర్శలను స్వాగతిస్తున్నట్లు వెల్లడి
  • కేజ్రీవాల్ ఎప్పుడు లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందన్న న్యాయస్థానం
  • ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టీకరణ
ప్రజలు ఓటు వేస్తే జూన్ 2న తిరిగి తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు కేవలం ఆయన ఊహ మాత్రమేనని... తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వమని, కాబట్టి ఆయన మాట్లాడిన అంశంపై చెప్పడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఈడీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తాను గెలిస్తే జైలుకు వెళ్లనని ఎలా చెబుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అదే సమయంలో కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ఇరువైపుల వాదనలను సుప్రీంకోర్టు విన్న తర్వాత.. ఈ తీర్పుపై విమర్శలను స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ఆయన ఎప్పుడు లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందని తెలిపింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశమని... చట్టపాలన దీని ఆధారంగానే సాగుతుందన్నారు. ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.


More Telugu News