సతీసమేతంగా మహారాష్ట్రలో చంద్రబాబు పర్యటన

సతీసమేతంగా మహారాష్ట్రలో చంద్రబాబు పర్యటన
  • కొల్హాపూర్ లో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి
  • అనంతరం షిరిడీ పయనం
టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు నేడు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయినాథుడి దర్శనం చేసుకోనున్నారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గతేడాది స్కిల్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన, విడుదల అనంతరం తరచుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రాజకీయ కార్యకలాపాలతో ముమ్మరంగా గడిపిన చంద్రబాబు, పోలింగ్ పూర్తయ్యాక మళ్లీ పుణ్యక్షేత్రాల బాటపట్టారు.


More Telugu News