మళ్లీ జగనే సీఎం.. కేంద్రంలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకూడదని కోరుకుంటున్నాం: గుడివాడ అమర్ నాథ్
- 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందన్న అమర్ నాథ్
- జగన్ కోసం వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని కితాబు
- ఏపీలో కేఏ పాల్, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఒకటేనని ఎద్దేవా
ఏపీ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విక్టరీని సాధించబోతోందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 23 ఎంపీ స్థానాలను వైసీపీ గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలని... కేంద్రంలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదని కోరుకుంటున్నామని అన్నారు. ఈ ఎన్నికలను మూడు రాజధానులపై రిఫరెండంగా తీసుకుంటామని చెప్పారు. విశాఖలోనే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
జగన్ మళ్లీ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు ఎంతో కష్టపడ్డాయని అమర్ నాథ్ కితాబునిచ్చారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందని ప్రచారం చేసుకుంటున్నారని... ఇందులో వాస్తవం లేదని అన్నారు. ఓటమిని తట్టుకోలేక టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. జగన్ హయాంలో 85 శాతం మంది లబ్ధి పొందారని... అందుకే తాము విజయంపై ధీమాగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో కేఏ పాల్ ప్రభావం ఎంతో... కాంగ్రెస్ ప్రభావం కూడా అంతేనని ఎద్దేవా చేశారు.