ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా?
- ఎవరికి వారు గూగుల్ డాక్టర్లు అయిపోవడమే దీని లక్షణం
- అనారోగ్య సమస్యలను ఇంటర్నెట్ లో దొరికే సమాచారంతో తప్పుగా పోల్చుకుంటున్న వైనం
- వైద్యుడి రోగ నిర్ధారణ సామర్థ్యానికి గూగుల్ సమాచారం ఏమాత్రం సమానం కాదన్న తాజా అధ్యయనం
ప్రస్తుతం నెటిజన్లంతా సమాచారం కోసం ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు చిట్కాలు, చికిత్స పద్ధతుల గురించి గూగుల్ లో ఎక్కువగా వెతుకుతూ ఎవరికి వారు గూగుల్ డాక్టర్లు అయిపోతున్నారు. ఇలా వైద్యం కోసం డాక్టర్ ను ఆశ్రయించకుండా అతిగా ఇంటర్నెట్ పై ఆధాపడే లక్షణాన్నే ‘ఇడియట్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు. అంటే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ర్టక్షన్ ట్రీట్ మెంట్ అన్నమాట. దీన్నే సైబర్ క్రోండియా అని కూడా పిలుస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీకున్న అనారోగ్య లక్షణాలను ఇంటర్నెట్ లో లభించే వైద్య సమాచారంతో పోల్చుకొని తప్పుగా అన్వయించుకోవడం అన్నమాట. ఇటీవలి కాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోయినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
వైద్యం కోసం గూగుల్ పై ఆధారపడే వారు తమకు తాము మేలుకన్నా కీడే ఎక్కువగా చేసుకుంటున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ లక్షణాలు ఉన్న రోగులు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న వైద్య సమాచారంతో స్వీయ చికిత్సలు చేసుకుంటున్నారని చెప్పింది. కొందరేమో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లో సూచించిన వైద్యాన్ని కూడా పక్కన పెడుతున్నారని పేర్కొంది. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపింది.
నమ్మదగ్గ వైద్య వెబ్ సైట్ల ద్వారా రోగులు విశ్వసనీయమైన సమాచారం పొందడం వరకు మంచిదేనని.. కానీ అర్హతగల వైద్య నిపుణుడి వ్యాధి నిర్ధారణ సామర్థ్యానికి అది ఏమాత్రం సమానం కాదని స్పష్టం చేసింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ‘క్యూరియస్’ లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.