జగన్ అన్నదే విజయం: అంబటి రాంబాబు

  • కూటమిలో నాలుగో పార్ట్ నర్ గా పోలీసులు చేరారన్న అంబటి
  • పోలీసులు చేరి ఫైట్ చేసినా జగన్ దే విజయమని వ్యాఖ్య
  • పోలింగ్ రోజు నుంచీ పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్న అంబటి
ఏపీలో ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష కూటమి తమదే విజయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. రకరకాల ఎగ్జిట్ పోల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూన్ 4న ఏ పార్టీ భవితవ్యం ఏమిటో తేలిపోబోతోంది. 

మరోవైపు ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ... కూటమిలో నాలుగవ పార్ట్ నర్ గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసినా... జగన్ అన్నదే విజయం అని చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా పోలీసుల తీరుపై అంబటి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి తొత్తులుగా కొందరు పోలీసు అధికారులు వ్యవహరించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులను కూడా హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి రావాలంటూ ఈసీ ఆదేశించడం పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, తన నియోజకవర్గంలో రీపోలింగ్ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News