మరోసారి షాకిచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. టికెట్ రద్దు చేసుకున్న వైనం
- నిన్న అర్ధరాత్రి మ్యూనిక్ నుంచి బెంగళూరుకు రావాల్సి ఉన్న ప్రజ్వల్
- టికెట్ రద్దు చేసుకున్నట్టు గుర్తించిన అధికారులు
- ఇప్పటికి నాలుగు సార్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న ప్రజ్వల్
సెక్స్ స్కాండల్ లో అడ్డంగా బుక్ అయిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ... ఇండియాకు తిరిగి వచ్చే విషయంలో దాగుడుమూతలు ఆడుతున్నారు. విదేశాల్లో ఉన్న రేవణ్ణ నిన్న అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారని అందరూ భావించారు. జర్మనీలోని మ్యూనిక్ సిటీ నుంచి బెంగళూరుకు ఆయన బుక్ చేసుకున్న టికెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే, చివరి క్షణంలో ప్రజ్వల్ తన ఫ్లైట్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. టికెట్ రద్దు చేసుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. విదేశాలకు వెళ్లినప్పటి నుంచి ఆయన నాలుగు సార్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.
మరోవైపు ప్రజ్వల్ కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ... సిట్ కు అన్ని వసతులు కల్పించామని... ఆయన ఎక్కడున్నారనే విషయం త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. ఇంకోవైపు, ప్రజ్వల్ ప్రాతినిథ్యం వహిస్తున్న హాసన్ లో సిట్ అధికారులు నిన్న 18 చోట్ల సోదాలు నిర్వహించారు.