ఐపీఎల్ 2024 పూర్తవ్వకుండానే వెళ్లిపోతున్న ఇంగ్లండ్ క్రికెటర్లపై ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర ఆగ్రహం
- ఆడితే సీజన్ మొత్తం పూర్తిగా ఆడాలన్న టీమిండియా మాజీ క్రికెటర్
- లేదంటే అసలు రావొద్దంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డ మాజీ ఆల్‌రౌండర్
- టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు
టీ20 వరల్డ్ కప్-2024 సమీపిస్తుండడంతో శిక్షణ కోసమంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి వెనక్కి పిలిచింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన ఆ దేశ క్రికెటర్లు జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), సామ్ కర్రాన్ (పంజాబ్ కింగ్స్) స్వదేశం బయలుదేరారు. ఐపీఎల్‌లో తమతమ జట్లు ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన దశలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ విధంగా మధ్యలోనే వెళ్లిపోతుండడంపై టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.
‘‘ఉంటే పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండండి లేదా అసలు రావద్దు!’’ అంటూ ఎక్స్ వేదికగా పఠాన్ మండిపడ్డాడు. ఐపీఎల్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతుండడంపై పఠాన్ ఈ విధంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా ఇంగ్లండ్‌కు చెందిన రాజస్థాన్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ అందుబాటులో లేడు. స్వదేశానికి వెళ్లిపోవడమే కారణంగా ఉంది. ఇక ఇంగ్లండ్‌కే చెందిన సామ్ కర్రాన్ పంజాబ్ కింగ్స్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. అతడు కూడా స్వదేశం వెళ్లిపోనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.