టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు గుండెపోటు
- విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొనకళ్ల
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న కుటుంబ సభ్యులు
- 2009, 2014లో టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందిన కొనకళ్ల
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో... కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు. కొనకళ్ల గుండెపోటుకు గురయ్యారన్న వార్తతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఆరా తీసినట్టు సమాచారం.
2009, 2014లో మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున కొనకళ్ల ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు. 2019లో అక్కడి నుంచే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బాలశౌరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కొనకళ్లకు టికెట్ దక్కలేదు. వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలశౌరి కూటమి తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బాలశౌరితో పాటు కూటమి అభ్యర్థుల తరపున కొనకళ్ల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.