రాజస్థాన్ బ్యాటర్లు విఫలం.. పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యం!
- గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్
- టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్
- నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగుల స్వల్ప స్కోర్
- 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా రియాన్ పరాగ్
గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. రియాన్ పరాగ్ మరోసారి 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొంది ఐదో స్థానంలో దిగిన రవిచంద్రన్ అశ్విన్ కూడా 19 బంతుల్లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
కెప్టెన్ సంజూ శాంసన్ 18, ఓపెనర్ టామ్ టామ్ కోహ్లర్ 18 పరుగులు చేశారు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (04) నిరాశపరిచాడు. అలాగే మిగతా బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో సారధి సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటుందో చూడాలి.
ఇక ఇప్పటికే ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరడంతో ఆ జట్టుకు ఇది కేవలం నామమాత్రపు మ్యాచే. నిన్నటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించడంతో రాజస్థాన్ నాకౌట్‌కు మార్గం సుగమమైంది. మరోవైపు ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి నుంచి ఘోరంగా ఆడిన పంజాబ్ ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగింది.