పంజాబ్, రాజస్థాన్ మధ్య నామమాత్రపు మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శాంసన్
- గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్
- ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన ఆర్ఆర్
- ఘోరమైన ప్రదర్శన కారణంగా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పీబీకేఎస్
ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం నువ్వా? నేనా? అన్నట్లు సాగుతున్న ఐపీఎల్ పోరులో ఈ మ్యాచ్ నామమాత్రం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరింది. మరోవైపు ఈ సీజన్‌లో ఘోరమైన ప్రదర్శన కారణంగా ఇప్పటికే పీబీకేఎస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టాప్-2లో నిలవాలని రాజస్థాన్ భావిస్తుంటే.. టాప్ జట్టు ఆర్ఆర్‌ను మట్టికరిపించి అభిమానులకు అసలైన మజా ఇవ్వాలని పంజాబ్ చూస్తోంది.
రాజస్థాన్ జట్టు: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.
పంజాబ్ జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), రిలీ రోసౌ, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, సామ్ కర్రాన్ (కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.