డబ్బు కోసం కాదు .. ఎన్టీఆర్ కోసమే ఆ సాంగ్ చేశాను: హీరోయిన్ కాజల్
- నటిగా 20 ఏళ్ల ప్రయాణం
- ఇప్పటికీ బిజీగానే ఉన్న కాజల్
- త్వరలో రానున్న 'ఇండియన్ 2' .. 'సత్యభామ'
- 'జనతా గ్యారేజ్' గురించిన ప్రస్తావన
కాజల్ తన కెరియర్ ను మొదలుపెట్టి 20 ఏళ్లు అయింది. తెలుగు .. తమిళ భాషల్లో ఒకే సమయంలో ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక్కడా .. అక్కడా కూడా ఆమె సీనియర్ స్టార్ హీరోలతో సైతం ఆడిపాడటం విశేషం. అలాంటి కాజల్ ఇప్పుడు కూడా తన జోరును కొనసాగిస్తూనే ఉంది. 'ఇండియన్ 2' .. 'సత్యభామ' సినిమాలతో త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది.
కాజల్ హీరోయిన్ గా తన జోరు కొనసాగుతున్న సమయంలోనే 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ తో కలిసి 'నేను పక్కా లోకల్' అనే స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఆ సాంగ్ అటు యూత్ ను .. ఇటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చాలా ఫంక్షన్స్ లో ఆ పాట వినిపిస్తూ ఉంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ .. "ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడం వలన నేను ఆ సాంగ్ చేశానని చాలామంది అనుకుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎన్టీఆర్ గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి సినిమాలు చేశాను. ఆయన వల్లనే ఆ పాట చేయడానికి ఒప్పుకున్నాను" అని అన్నారు.