ఓటమి భయంతోనే అరాచకాలు.. హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: టీడీపీ నేతలు
- రౌడీలు, గూండాలను జగన్ పెంచి పోషిస్తున్నారని ఆరోపణ
- పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శ
- జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడం బాధాకరమన్న నేతలు
- మాచర్లలో గూండాలు, రౌడీలను ముందే తీసుకొచ్చి పెట్టారని వ్యాఖ్య
- పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలి? అంటూ ధ్వజం
ఏపీలో పోలింగ్ తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్ల రామయ్య, అమర్నాథ్‌రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. రౌడీలు, గూండాలను జగన్ పెంచి పోషిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నారని విమర్శించారు. వైసీపీ అరాచకాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడం బాధాకరమన్నారు. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడులు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం వైసీపీ అరాచకానికి పరాకాష్ఠగా అభివర్ణించారు.
గూండాలు, రౌడీలను ముందే తీసుకొచ్చి మాచర్లలో మోహరించారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే వైసీపీ ఎంతగా బరితెగించిందో అర్థమవుతోందని నేతలు మండిపడ్డారు. మాచర్లలో పర్యటించి తమ కార్యకర్తలకు ధైర్యం కల్పించడంతో పాటు పరిస్థితులను చంద్రబాబుకు నివేదిస్తామన్నారు. హింసా రాజకీయాలకు పాల్పడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు టీడీపీ నేతలు.