400 సీట్లు వస్తే పీవోకే భారత్‌లో విలీనం కావడం ఖాయం: అసోం సీఎం హిమంత
- మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందన్న అసోం సీఎం
- 300 సీట్లు గెలిస్తే అయోధ్యలో బాలరాముడి ఆలయం నిర్మించామని వెల్లడి
- 400 సీట్లు గెలుచుకుంటే మధుర, వారణాసిలలో ఆలయాలు నిర్మిస్తామన్న హిమంత బిశ్వ శర్మ
బీజేపీకి 400 సీట్లు వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనం కావడం ఖాయమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు చేశారని సచిన్ టెండుల్కర్‌ని అడిగితే సమాధానం ఉండదని గుర్తించాలన్నారు. అదేవిధంగా గత లోక్ సభ ఎన్నికల్లో 300 సీట్లు గెలిచిన బీజేపీ అయోధ్యలో బాలరాముడి ఆలయాన్ని నిర్మించిందని, ఇప్పుడు 400 సీట్లు గెలుచుకుంటే శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో దేవాలయాన్ని, వారణాసిలో బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తుందన్నారు. అదే సమయంలో పీవోకేను భారత్‌లో విలీనం చేసేందుకు కృషి చేస్తుందన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పీవోకేలో శాంతి నెలకొందని, ఇటీవల నిరసనలు వ్యక్తమవుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్వరలో పీవోకే భారత్‌లో విలీనం అవుతుందనడంలో సందేహం లేదన్నారు. పీవోకేను తిరిగి మనదేశంలో కలిపేందుకు కృషి చేస్తామన్నారు.
మరోపక్క విదేశాంగ మంత్రి జైశంకర్ చెబుతూ, పీవోకేలో తీవ్ర దుమారం చెలరేగుతోందని... సోషల్ మీడియా, టీవీల్లో చూస్తున్నామని అన్నారు. జమ్ములో ఉంటున్న వారితో తమ పరిస్థితిని పీవోకే ప్రజలు పోల్చుకుంటున్నారన్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని వారు కళ్లారా చూస్తున్నారని తెలిపారు.