మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

  • మే 30వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
  • కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచిన విచారణ అధికారులు
  • మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 9న సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మే 30వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. నేటితో కస్టడీ ముగియడంతో మరో పదిహేను రోజులు పొడిగించింది. సిసోడియాను ఈడీ అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. 

నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై చేసిన అప్పీల్ ఆధారంగా... ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సిసోడియాపై ఉన్న అభియోగాలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 9న ఈడీ మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసింది. నాటి నుంచి తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.


More Telugu News