జేసీ అనుచరుడిపై వేట కొడవళ్లతో దాడి.. అర్ధరాత్రి జేసీ, పెద్దారెడ్డిలను తరలించిన పోలీసులు
- వేట కొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- విషమంగా ఉన్న దాసరి కిరణ్ పరిస్థితి
- తాడిపత్రిలో 144 సెక్షన్ విధింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్ పై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కూడా వేరే ప్రాంతానికి పంపించారు. తాడిపత్రిలో పెద్ద సంఖ్యలో పారా మిలిటరీ బలగాలు ఉన్నప్పటికీ జేసే ప్రభాకర్ రెడ్డి అనుచరుడు కిరణ్ పై దాడి జరగడం గమనార్హం. ఈ హత్యాయత్నంతో తాడిపత్రి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు, పరిస్థితులు చేజారకుండా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. జేసీ, పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.