విరాట్ కోహ్లీని అధిగమించి వరల్డ్ రికార్డు సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్

  • టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచిన బాబర్
  • 39 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి ఆటగాడిగా నిలిచిన పాక్ స్టార్ బ్యాటర్
  • 38 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రెండవ స్థానానికి పడిపోయిన విరాట్ కోహ్లీ
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని అధిగమించి ఈ ఫార్మాట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌, పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో 42 బంతుల్లో 75 పరుగులు బాదాడు. దీంతో టీ20ల్లో 39వ 50 ప్లస్ స్కోర్‌ని నమోదు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి దిగజారాడు. విరాట్ కోహ్లీ టీ20ల్లో 38 సార్లు 50కిపైగా స్కోర్లు చేశాడు. కాగా 34 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు..

1. బాబర్ ఆజం - 39
2. విరాట్ కోహ్లీ - 38
3. రోహిత్ శర్మ - 34
4. మహ్మద్ రిజ్వాన్ - 29
5. డేవిడ్ వార్నర్ - 27


More Telugu News