పేర్ని నాని మీద వ్యతిరేకత వల్లే భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది: బాలశౌరి

  • ఎప్పుడూ లేనంతగా పోలింగ్ నమోదయిందన్న బాలశౌరి
  • పేర్ని నానికి బుద్ధి చెప్పేలా ఓటర్లు స్పందించారని వ్యాఖ్య
  • ఓటమి అర్థమై వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని విమర్శ
గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా పోలింగ్ నమోదయిందని... ఈ స్థాయి ప్రజా స్పందనను ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి అన్నారు. మచిలీపట్నం ఎంపీ స్థానంతో పాటు, దీని పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలను లెక్క చేయకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వచ్చారని తెలిపారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారని కొనియాడారు. 

మంత్రి పేర్ని నాని అరాచకాలకు బుద్ధి చెప్పేలా నియోజకవర్గ ప్రజలు అద్భుత రీతిన స్పందించారని బాలశౌరి అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పోలింగ్ నమోదు కావడానికి పేర్ని నాని మీద ఉన్న వ్యతిరేకతే కారణమని చెప్పారు. పేర్ని నానికి బుద్ధి చెప్పేలా నియోజకవర్గ ప్రజలు అద్భుతంగా స్పందించారని అన్నారు. వైసీపీ నేతలకు ఓటమి అర్థం కావడంతో... అరాచకాలకు, దాడులకు తెగబడ్డారని అన్నారు. కూటమికి చెందిన వారు మాత్రం ఎక్కడా దౌర్జన్యాలకు పాల్పడ లేదని... ఎంతో విజ్ఞతతో వ్యవహరించారని కితాబునిచ్చారు. 


More Telugu News