ఫ్రధాని మోదీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
- నిన్న వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన మోదీ
- తన మొత్తం ఆస్తులు రూ.3.02 కోట్లుగా పేర్కొన్న వైనం
- ఇల్లు, కారు, భూమి వంటి స్థిరచరాస్తులు లేవన్న ప్రధాని
- ఎఫ్‌డీ, ఎన్‌ఎస్‌సీల్లో పెట్టుబడులు
నిన్న వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తులు మొత్తం రూ.3.02 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద రూ.52,920 నగదు ఉందని వెల్లడించారు. అయితే, భూమి, కారు, ఇల్లు వంటి స్థిరచరాస్థులేవీ లేవని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మునుపటి ఎన్నికల అఫిడవిట్‌తో పోలిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఈసారి రెట్టింపయ్యింది. 2018-19లో ఈ ఆదాయం 11 లక్షలు కాగా 2022-23లో అది రూ.23.5 లక్షలకు చేరుకుంది. ఇక ప్రధానికి సంప్రదాయక పెట్టుబడి సాధనాలపైనే మక్కువని కూడా ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. రూ.2.85 కోట్లను ఎస్బీఐలో ఎఫ్‌డీ చేశారు. మరో రూ.9.12 లక్షలను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వ పెట్టుబడి పథకమైన ఎన్‌ఎస్‌సీతో ఏటా 7.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద మినహాయింపులు కూడా ఉన్నాయి. రిస్క్ తక్కువ ఉన్న పెట్టుబడి సాధనంగా దీనికి మదుపర్లలో పాప్యులారిటీ ఉంది. ఎన్ఎస్‌సీ ఒకేసారి ఐదు సంవత్సరాలకు గాను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కనీసం మొత్తం రూ.వెయ్యి.
2019 నాటి ఎన్నికల అఫిడవిట్‌లో మోదీ తనకు ఎన్‌ఎస్‌సీలో రూ.7.61 లక్షలు ఉన్నట్టు పేర్కొన్నారు. మరో రూ.1.28 కోట్ల ఎఫ్‌డీలు ఉన్నట్టు తెలిపారు. అప్పట్లో రూ.20 వేలు ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ రూపంలో ఉందని మోదీ పేర్కొన్నారు. కానీ ఈమారు అఫిడవిట్‌లో మాత్రం బాండ్ల ప్రస్తావన లేదు. మునుపటి వలెనే మోదీ తన అఫిడవిట్‌లో ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌ను పేర్కొన్నారు. అయితే, ఈ మొబైల్ వాట్సాప్‌కు లింక్ కాకపోవడం గమనార్హం. ట్రూ కాలర్‌లో మాత్రం ఈ నెంబర్‌కు పీఎమ్ నరేంద్ర జీ అన్న పేరు కనిపిస్తోంది.