భారీ టార్గెట్ ఇచ్చిన ఢిల్లీ... లక్నో టాపార్డర్ తడబాటు
- ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగుల స్కోరు నమోదు
- ఛేదనలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లక్నో
ప్లే ఆఫ్ రేసులో ముందంజ వేయాలంటే గెలుపు తప్పనిసరి అయిన నేపథ్యంలో, ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. ఇవాళ సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది.
విధ్వంసక ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగినా, మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ అర్ధ సెంచరీతో అలరించాడు. పోరెల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులు చేశాడు.
షాయ్ హోప్ 38, కెప్టెన్ రిషబ్ పంత్ 33 పరుగులు చేయగా... చిచ్చరపిడుగు ట్రిస్టాన్ స్టబ్స్ ధాటిగా ఆడాడు. స్టబ్స్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ 2, అర్షద్ ఖాన్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.
అనంతరం, 209 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ధాటికి లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (5), క్వింటన్ డికాక్ (12) వెనుదిరిగారు. ప్రమాదకర ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ (5) అక్షర్ పటేల్ అవుట్ చేయగా, మరోసారి బంతిని అందుకున్న ఇషాంత్ శర్మ ఈసారి దీపక్ హుడాను పెవిలియన్ చేర్చాడు. దీపక్ హుడా (0) డకౌట్ అయ్యాడు.
ప్రస్తుతం లక్నో స్కోరు 5 ఓవర్లలో 4 వికెట్లకు 48 పరుగులు కాగా... క్రీజులో నికోలాస్ పూరన్ (7 బంతుల్లో 21 బ్యాటింగ్), ఆయుష్ బదోనీ (3 బ్యాటింగ్) ఉన్నారు.