మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో మాట్లాడిన చంద్రబాబు
- ఎన్నికల అనంతరం హింసపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు
- మాచర్లలో పిన్నెల్లి భయానక వాతావరణం సృష్టిస్తున్నాడని ఆరోపణ
- అదనపు బలగాలు పంపాలని విజ్ఞప్తి
ఎన్నికల అనంతర హింసపై టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలను డీజీపీకి వివరించారు. మాచర్లలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు.
నియోజకవర్గంలో పిన్నెల్లి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. టీడీపీ కార్యకర్తలు, వారి ఆస్తులపై దాడుల ఘటనల పట్ల చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.