లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ... ఇద్దరికీ కావాలి ఓ గెలుపు!
- చివరి అంకానికి చేరుకున్న ఐపీఎల్ లీగ్ దశ
- ఇప్పటికే ప్లేఆఫ్ లో ప్రవేశించిన కోల్ కతా
- దాదాపుగా బెర్తు ఖాయం చేసుకున్న రాజస్థాన్
- రేసులో చెన్నై, సన్ రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో
ఐపీఎల్ లీగ్ దశ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ దశలో ప్రవేశించగా, రాజస్థాన్ రాయల్స్ కూడా దాదాపుగా బెర్తు ఖాయం చేసుకుంది. అయితే మిగతా రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ నెలకొని ఉంది.
టోర్నీలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించగా, లక్నో జుట్టు 12 మ్యాచ్ ల్లో 6 విజయాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో, ప్లే ఆఫ్ దిశగా ముందడుగు వేయాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ లో నెగ్గడం తప్పనిసరి.