మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- సీబీఐ, ఈడీ కేసుల్లో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- మద్యం కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
- ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రమేయం ఉందని హైకోర్టుకు తెలిపిన ఈడీ
మద్యం పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. మద్యం కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రమేయం ఉందని ఈడీ హైకోర్టుకు తెలిపింది.
ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం 17 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు.